'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' జూలై 17న గ్రాండ్ రిలీజ్
- June 29, 2025
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
హీరో నరేష్ అగస్త్యతో పాటు ప్రధాన నటులంతా కనిపించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా ప్లజెంట్ గా వుంది.
జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
తారాగణం: నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్ .
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - విపిన్
నిర్మాత - ఉమాదేవి కోట
బ్యానర్ - సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ - మోహన కృష్ణ
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్
ఆర్ట్ - తోట తరణి
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







