క్యాబిన్‌ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు..

- July 14, 2016 , by Maagulf
క్యాబిన్‌ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు..

దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షాకిచ్చింది. అదనపు క్యాబిన్‌ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దేశంలోని ఆరు మెట్రోల నుంచి ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు.. 7 నుంచి 10కిలోల బరువు గల ఒక క్యాబిన్‌ బ్యాగ్‌, ఒక ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌, ఒక పర్సు(మహిళలకు)ను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం ఉంది. అయితే ఇటీవల ప్రయాణికులు తమ వెంట పరిమితికి మించి క్యాబిన్‌ బ్యాగులను తీసుకురావడం ఎక్కువవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్‌ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఆదాయం కోసం తాము ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. ఎక్కువగా క్యాబిన్‌ బ్యాగులు తీసుకురావడంతో విమానంలో స్టోరేజ్‌ సమస్య ఏర్పడుతుందని జెట్‌ పేర్కొంది. దీని వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడటమే గాక.. విమానాల ఆలస్యానికి కూడా కారణమవుతుందని చెప్పింది.
అయితే జెట్‌ఎయిర్‌వేస్‌ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com