ఇజ్రాయెల్ తీరును తీవ్రంగా ఖండించిన సౌదీ..!!

- July 03, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ తీరును తీవ్రంగా ఖండించిన సౌదీ..!!

రియాద్: అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలను ఉల్లంఘిస్తూ.. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ పై సార్వభౌమత్వాన్ని విధించాలని ఇజ్రాయెల్ అధికారి చేసిన ప్రకటనలను సౌదీ అరేబియా ఖండించింది.  పాలస్తీనా భూమిపై స్థావరాలను విస్తరించే ప్రయత్నాలను రాజ్యం గట్టిగా తిరస్కరించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. 

అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలు, అరబ్ శాంతి చొరవకు అనుగుణంగా.. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడంతో సహా, వారి చట్టబద్ధమైన హక్కుల సాధనలో పాలస్తీనా ప్రజలకు సౌదీ అరేబియా పూర్తి మద్దతుగా ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com