రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్

- July 03, 2025 , by Maagulf
రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్

హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌లో లాభాలు వస్తాయని భరోసా ఇచ్చి, కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసగించిన దంపతులు పోలీసులకు పట్టుబడ్డారు.ఈ సంఘటన హైదరాబాద్‌ సైబరాబాద్‌ పరిధిలో కలకలం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పనేమ్ సురేశ్, పనేమ్ ఉజ్వల అనే భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు.సైబరాబాద్‌ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

మెసర్స్ క్రిస్ట్ ప్రాపర్టీస్, అగర్‌వుడ్ ఫార్మ్‌ల్యాండ్ వంటి పేర్లతో కంపెనీలు ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రచారంతో సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేశారు.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలేమీ కనిపించలేదు. అసలు డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదుల పై బాచుపల్లి, కొల్లూరు, చందానగర్‌, మాదాపూర్‌ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్నారు. సాక్ష్యాల ఆధారంగా నిందితుల అరెస్టు జరిగిందని సమాచారం. ఈ దంపతులు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com