రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్
- July 03, 2025
హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌లో లాభాలు వస్తాయని భరోసా ఇచ్చి, కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసగించిన దంపతులు పోలీసులకు పట్టుబడ్డారు.ఈ సంఘటన హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో కలకలం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పనేమ్ సురేశ్, పనేమ్ ఉజ్వల అనే భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు.సైబరాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
మెసర్స్ క్రిస్ట్ ప్రాపర్టీస్, అగర్వుడ్ ఫార్మ్‌ల్యాండ్ వంటి పేర్లతో కంపెనీలు ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రచారంతో సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేశారు.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలేమీ కనిపించలేదు. అసలు డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుల పై బాచుపల్లి, కొల్లూరు, చందానగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్నారు. సాక్ష్యాల ఆధారంగా నిందితుల అరెస్టు జరిగిందని సమాచారం. ఈ దంపతులు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







