స్మార్ట్ యాప్ ద్వారా తన తండ్రిపై 10 ఏళ్ల బాలుడు ఫిర్యాదు..!!
- July 04, 2025
దుబాయ్: 10 ఏళ్ల బాలుడు దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్ ఉపయోగించి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. వెంటనే బాలల, మహిళా రక్షణ విభాగం స్పందించింది. తన తమ్ముళ్లలా కాకుండా, తన తండ్రి తనను పదే పదే కొడుతున్నాడని బాలుడు ఫిర్యాదులో చెప్పాడు. తండ్రి కొట్టిన దెబ్బల వల్ల అతని శరీరంపై కనిపించే గాయాలు ఏర్పడ్డాయని, వాటిని అతను క్లాస్‌మేట్స్ నుండి దాచడానికి ప్రయత్నించాడని, పాఠశాలలో అతని పనితీరు కూడా తగ్గడం ప్రారంభమైందని అధికారులకు అతని స్కూల్ సామాజిక కార్యకర్త తెలిపింది. గాయాలను గమనించగానే దుబాయ్ పోలీసులను సంప్రదించినట్లు తెలిపారు.
బాలల, మహిళా రక్షణ విభాగం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అలీ అల్ మాత్రూషి ప్రకారం. మొదట్లో ఆ బాలుడు తన తండ్రికి భయపడి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. "పాఠశాల సామాజిక కార్యకర్త పిల్లవాడికి నమ్మకాన్ని కలిగించారు. పోలీసు స్మార్ట్ యాప్‌ను ఉపయోగించమని సూచించారు." అని అల్ మాత్రూషి అన్నారు.
దుబాయ్ పోలీసులు తండ్రిని పిలిపించారు. అతను తన కొడుకును కొట్టినట్లు అంగీకరించాడు. కానీ హాని కలిగించే ఉద్దేశ్యం లేదని చెప్పాడని అల్ మాత్రూషి తెలిపారు. "కఠినమైన క్రమశిక్షణ పిల్లవాడిని మంచిగా పెంచుతుందని అతను భావించాడు. కానీ దాని వల్ల బాలుడు గాయపడ్డాడు. అతని మానసిక పరిస్థితిపై ప్రభావం చూపింది." అని అల్ మాత్రూషి అన్నారు. ఈ రకమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, చట్టం ప్రకారం శిక్షార్హమైనదని తెలిపారు. తండ్రి తన పద్ధతిని మార్చుకుంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు.
యూఏఈ పిల్లల రక్షణ చట్టం ప్రకారం పిల్లల హక్కులు రక్షించబడతాయని నివాసితులకు గుర్తు చేశారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, వెబ్‌సైట్ ద్వారా, 901 కు కాల్ చేయడం ద్వారా లేదా అల్ ట్వార్‌లోని దుబాయ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని చైల్డ్ ఒయాసిస్‌ను సందర్శించడం ద్వారా సంఘటనలను నివేదించాలని సూచించారు.
యూఏఈలో నివసిస్తున్న పిల్లల హక్కులు, శ్రేయస్సును కాపాడటానికి సమగ్ర పిల్లల రక్షణ చట్టాన్ని అమలు చేసింది. వదీమా చట్టం అని పిలువబడే ఫెడరల్ చట్టం దేశంలో పిల్లల రక్షణకు మూలస్తంభంగా ఉందని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!