Dh4కే వస్తువులు: యూఏఈలో అమెజాన్ బజార్ ప్రారంభం..!!
- July 04, 2025
యూఏఈ: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ బజార్ ఇప్పుడు యూఏఈలో ప్రారంభమైంది. చౌకగా ఉత్పత్తులను అందించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కేవలం Dh4 నుండి ఫ్యాషన్, హోమ్, లైఫ్ స్టైల్ తోపాటు అనేక వస్తువులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే, మొదటి నెలలో ఆర్డర్ చేసే దుకాణదారులకు అన్ని ఆర్డర్‌లపై 25 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది.
అమెజాన్ బజార్ అనేది ఆన్ లైన్-వర్షన్ మాత్రమే. వినియోగదారులు యాప్‌లో 'బజార్' కోసం కూడా సెర్చ్ చేయవచ్చు. లేదా amazon.ae/bazaar ద్వారా వారి మొబైల్ బ్రౌజర్‌లో యాక్సెస్ చేయవచ్చు. పెద్ద ఆర్డర్‌లు చేసే ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. Dh150 కంటే ఎక్కువ ఆర్డర్ చేసే వినియోగదారులు ఐదు శాతం తగ్గింపును.. Dh300 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
15 రోజుల ఉచిత రిటర్న్
అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు అన్ని ఆర్డర్‌లపై ఉచిత షిప్పింగ్‌ను పొందవచ్చు. అమెజాన్ బజార్ కొనుగోలుదారులకు Dh90 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని అందిస్తుంది. చాలా ఉత్పత్తులు ఆరు నుండి పన్నెండు రోజుల్లోపు వస్తాయి. ఉచిత 15-రోజుల రిటర్న్‌లు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్‌లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







