BCCI: బంగ్లాదేశ్ పర్యటనకు బ్రేక్..

- July 04, 2025 , by Maagulf
BCCI: బంగ్లాదేశ్ పర్యటనకు బ్రేక్..

భారత క్రికెట్ జట్టు (BCCI)కి ఆగస్టులో చేపట్టాల్సిన బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.

త్వ‌ర‌లోనే బీసీసీఐ, బీసీబీ సంయుక్త ప్రకటన
షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 17 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, అక్కడి స్థానిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో బీసీసీఐ(BCCI)కి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ (Green signal)లభించలేదు. ప్రభుత్వ అనుమతి వస్తేనే జట్టును పంపుతామని బీసీసీఐ (BCCI)కి ఇదివరకే స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను వాయిదా వేయడమా? లేక పూర్తిగా రద్దు చేయడమా? అనే అంశంపై బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

మీడియా హక్కుల వేలం నిలిపివేత
మరోవైపు టీమిండియా పర్యటన రద్దయ్యే సూచనలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలింది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని 2025-27 కాలానికి మీడియా హక్కుల అమ్మకానికి బీసీబీ ప్రణాళికలు సిద్ధం చేసింది. జులై 7, 10 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించాలని భావించింది. కానీ, తాజా పరిణామాలతో మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌(Pakistan)తో సిరీస్‌ల మాదిరిగా ఈ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశంపైనా చర్చలు జరుగుతున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

భారత క్రికెట్‌ అభిమానులకు నిరాశేనా?
ఆసియా కప్, T20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సిరీస్ టీమిండియా కోసం ఉపయోగపడేది. టూర్ రద్దైతే ప్రాక్టీస్ ఛాన్స్ కోల్పోతుందన్న ఆందోళన కూడా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com