ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఒమన్, బల్గేరియా చర్చలు..!!
- July 04, 2025
సోఫియా: ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఒమన్, బల్గేరియా సోఫియా నగరంలో అధికారిక చర్చలు జరిపారు. ఒమన్ నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది నాయకత్వం వహించగా, బల్గేరియన్ నుండి బల్గేరియా రిపబ్లిక్ ప్రధాన మంత్రి రోసెన్ డిమిట్రోవ్ జెలియాజ్కోవ్ పాల్గొన్నారు.
ఈ సెషన్ లో రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం సహా వివిధ అంశాలను చర్చించారు. ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ రంగాలలో భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఈ సెషన్‌లో బల్గేరియాకు ఒమన్ సుల్తానేట్ నాన్-రెసిడెంట్ రాయబారి యూసఫ్ అహ్మద్ అల్ జాబ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో యూరప్ విభాగం అధిపతి ముంతిర్ మహఫౌద్ అల్ మంధేరిలతోపాటు రెండు దేశాల నుండి ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..