సాహెల్ యాప్లో సివిల్ ఐడి, అడ్రస్ చేంజ్ సర్వీస్ నిలిపివేత..!!
- July 04, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) "సాహెల్" ప్రభుత్వ యాప్లో సివిల్ ఐడి నివాస చిరునామా మార్పు సేవను తాత్కాలికంగా నిలిపివేసింది. కువైట్ కాని నివాసితులకు ఎలక్ట్రానిక్ సేవలను మెరుగుపరచడానికి కొనసాగుతున్న అభివృద్ధి ప్రయత్నాలలో భాగంగా ఈ సస్పెన్షన్ విధించినట్లు తెలిపింది.
ఆన్లైన్ సేవను మెరుగుపరిచి త్వరలోనే సరికొత్తగా సాహెల్ యాప్, PACI వెబ్సైట్ రెండింటి ద్వారా త్వరలో దీన్ని తిరిగి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు, తమ నివాస చిరునామాను మార్చుకోవాలనుకునే ప్రవాసులు అధికారిక అపాయింట్మెంట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
PACI నాలుగు సేవా కేంద్రాలలో చిరునామా మార్పుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రధాన భవనం: సాయంత్రం వేళలు, మధ్యాహ్నం 3:00 నుండి 7:00 వరకు.. జహ్రా, అహ్మదీ కేంద్రాలు: ఉదయం వేళలు, ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు..లిబరేషన్ టవర్: ఉదయం మరియు సాయంత్రం వేళలలో పనిచేస్తుంది.
సాహెల్ యాప్ సేవను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత చాలా మంది నివాసితులు తమ చిరునామా మార్పు లావాదేవీలను పూర్తి చేయడానికి ప్రయత్నించడంతో బుధవారం, గురువారం సాయంత్రం వేళల్లో అధికార ప్రధాన భవనంలో భారీగా జనం రద్దీ నెలకొంది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..