Dh30,000 నగదు చోరీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు..!!

- July 04, 2025 , by Maagulf
Dh30,000 నగదు చోరీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు..!!

దుబాయ్: అల్రాస్‌లోని నాలుగు ట్రేడింగ్ కంపెనీల కార్యాలయాల్లోకి చొరబడిన ఐదుగురు ఇథియోపియన్ జాతీయుల ముఠాపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. అధికారుల కథనం ప్రకారం, అనుమానితులు బలవంతంగా లోపలికి ప్రవేశించి, సేఫ్‌ లాకర్లను తెరిచి సుమారు Dh30,000 నగదును దొంగిలించారు.

కంపెనీ యజమానులు ఉదయం వారి కార్యాలయానికి చేరుకుని, సేఫ్‌లు ధ్వంసం చేయబడినట్లు గుర్తించి, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.  పెట్రోలింగ్ అధికారులు, క్రైమ్-సీన్ ఇన్వెస్టిగేటర్లు,  ఫోరెన్సిక్ నిపుణుల సంయుక్త బృందం ఆధారాలను సేకరించి, సిసిటివి ఫుటేజ్‌లో అనుమానితులు టయోటా కరోల్లా కారులో పారిపోయినట్లు గుర్తించారు.

వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్‌ ఆధారంగా ట్రాక్ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నలుగురు అనుమానితులను అబుదాబిలో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఐదుగురు అనుమానితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 18,000 దిర్హామ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని వారు తమ స్వదేశానికి బదిలీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, దితులపై త్వరలో అధికారికంగా అభియోగాలు మోపబడతాయని అధికారలు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com