బహ్రెయిన్ - లెబనాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరుణ..!!
- July 04, 2025
మానామా: బహ్రెయిన్ బీరూట్‌లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. దాదాపు నాలుగు సంవత్సరాల దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం, ప్రస్తుతం సిరియాలో ఉన్న బహ్రెయిన్ లెబనాన్‌లో కొత్తగా నియమితులైన రాయబారి వహీద్ ముబారక్ సయ్యార్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. లెబనాన్ తో బలమైన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి బహ్రెయిన్ నిబద్ధతతో పనిచేస్తుందని సయ్యార్ తెలిపారు.
లెబనాన్.. అనేక గల్ఫ్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన వివాదం తరువాత, బహ్రెయిన్ అక్టోబర్ 2021లో బీరుట్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. యెమెన్‌లో సౌదీ నేతృత్వంలోని సైనిక ప్రచారాన్ని విమర్శించిన లెబనాన్ మాజీ సమాచార మంత్రి జార్జ్ కొర్దాహి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. అతని వ్యాఖ్యల కారణంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ తమ రాయబారులను వెనక్కి పిలిపించుకుని లెబనీస్ రాయబారులను బహిష్కరించాయి. కాగా, సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నంలో కొర్దాహి డిసెంబర్ 2021లో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో వివాదం సద్దమణిగినట్టైంది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..