ప్రాణాన్ని రక్షించి, మాతృత్వాన్ని నిలిపిన మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్

- July 04, 2025 , by Maagulf
ప్రాణాన్ని రక్షించి, మాతృత్వాన్ని నిలిపిన మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్

హైదరాబాద్: అత్యున్నత వైద్య నైపుణ్యం మరియు అంకితభావంతో కూడిన సంరక్షణతో, మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ మరోసారి తన వైద్య శ్రేష్ఠతను నిరూపించుకుంది.35 ఏళ్ల నందిత అనే యువతి, తీవ్రమైన యోని రక్తస్రావంతో, హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 3.7gm/dL గా ఉండగా అత్యవసర విభాగానికి చేరారు.పెద్ద గర్భాశయ ఫైబ్రాయిడ్ కారణంగా, పలు ప్రముఖ ఆసుపత్రులు ఆమెకు గర్భాశయం తొలగించమని సూచించాయి. కానీ మెడికవర్ వైద్య బృందం, మాతృత్వ అవకాశాన్ని కాపాడే మార్గాన్ని ఎంచుకుంది.

మెడికవర్‌కు రాకముందు,నందిత పాల్ పరిస్థితి వేగంగా క్షీణించడంతో ఆమెకు ఇప్పటికే 16 యూనిట్ల రక్తం ఎక్కించారు.గర్భాశయ ఫైబ్రాయిడ్ పరిమాణం 10Cms, స్థానం కారణంగా, ప్రాణాంతక రక్త నష్టాన్ని నివారించడానికి హిస్టెరెక్టమీని సాధారణ చికిత్సగా భావిస్తారు. అయినప్పటికీ, మెడికవర్ శస్త్రచికిత్సా బృందం, డాక్టర్ పృథ్వీ పెరుమ్ (కన్సల్టెంట్ రోబోటిక్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్) నేతృత్వంలో, డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి (సర్జికల్ ఆంకాలజీ), డాక్టర్ శిల్ప(అనస్థీషియా) ల సహకారంతో,అత్యవసర మయోమెక్టమీని (ఫైబ్రాయిడ్‌ను తొలగిస్తూ గర్భాశయాన్ని సంరక్షించే ప్రక్రియ) చేయాలని నిర్ణయించుకుంది.
శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని తగ్గించేందుకు, తాత్కాలిక గర్భాశయ ధమని అడ్డుకునే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.ఈ విధానం అధిక ప్రమాదంలోనూ ఫైబ్రాయిడ్‌ను సురక్షితంగా తొలగించేందుకు సహాయపడింది.

“నందిత ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆమె మాతృత్వ స్వప్నాన్ని కూడా కాపాడగలగడం మాకు గర్వకారణం,” అని డా. పృథ్వీ తెలిపారు. “ఈ విజయం, అత్యవసర పరిస్థితుల్లో మెడికవర్ అందించే వ్యక్తిగతమైన, ఆధునిక వైద్యం ప్రాముఖ్యతను చాటుతోంది.”

ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటూ ఉండగా, ఆమె గర్భాశయం కూడా సురక్షితంగా నిలబడింది. ఈ విజయవంతమైన చికిత్స, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్యం అందించడంలో మెడికవర్ నిబద్ధతను చాటిచెబుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com