హైకోర్టు ని సంప్రదించిన 'కబాలి' నిర్మాత!
- July 14, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థను గురువారం మద్రాసు హైకోర్టును సంప్రదించారు. 'కబాలి' చిత్రాన్ని అనధికారికంగా డౌన్లోడ్ చేసుకుంటున్న దాదాపు 180కి పైగా వెబ్సైట్లను తొలగించాలని కలైపులి హైకోర్టులో పిటీషను దాఖలు చేశారు. అనధికారికంగా డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లను ట్రాయ్ సహాయంతో బ్లాక్ చేయాలని పిటీషన్లో కలైపులి కోరారు. తమిళనాడు పైరసీ వ్యతిరేక సెల్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆన్లైన్ ద్వారా రావాల్సిన వంద శాతం ఆదాయంలో 70 శాతం అనధికారిక డౌన్లోడింగ్వల్ల పోతోందని, మిగిలిన 30 శాతం మాత్రమే వస్తోందని ఆయన పేర్కొన్నారు. 'కబాలి' చిత్రం జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికాఆప్టే కథానాయికగా నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







