దక్షిణ కొరియాలో ‘లవ్ బగ్స్’ విజృంభణ…
- July 05, 2025
పేరులో ‘లవ్’ ఉన్నా, ఈ పురుగుల వల్ల ప్రేమ కాదు, అసహ్యం వస్తోంది. దక్షిణ కొరియా లోని సియోల్, ఇంచియాన్ నగరాలు ప్రస్తుతం ‘లవ్ బగ్స్’ బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.లక్షల సంఖ్యలో వీటి గుంపులు ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి.రాజధానికి పశ్చిమంగా ఉన్న గ్యేయాంగ్సాన్ పర్వత ప్రాంతం పూర్తిగా ఈ పురుగుల ఆధీనంలోకి వెళ్లింది. హైకింగ్ మార్గాలు అన్నీ పురుగుల గుట్టలతో నిండిపోయాయి. స్థానికులు నడవలేక నరకం చూస్తున్నారు. ప్రభుత్వం అత్యవసరంగా సిబ్బందిని రంగంలోకి దించింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు
వీడియోలలో కొందరు ఈ పురుగుల మధ్య ప్రయాణిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి ఈ కీటకాలను బర్గర్లో పెట్టి తినడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇవి వాస్తవంగా లవ్ బగ్స్ అనే పేరు పొందింది ఒకదానికొకటి అతుక్కుని ఉండే అలవాటుతో.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అధిక ఉష్ణోగ్రతలే ఈ పురుగుల పెరుగుదలకు కారణం. సియోల్‌లోని హీట్-ఐలాండ్ ప్రభావం దీనికి దోహదపడుతోందని పేర్కొంటున్నారు. ఈ కీటకాలు ‘ప్లేసియా లాంగిఫోర్సెప్స్’ అనే శాస్త్రీయ నామంతో పిలవబడతాయి.
వీటితో నష్టమేమీ లేదంటున్న అధికారులు
ఈ పురుగులు కాటేసేలా ఉండవు. వ్యాధులు వ్యాపించవు. పైగా పర్యావరణానికి మేలు చేస్తాయట. పూల పరాగ సంపర్కంలో ఇవి సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు. అయినా, గోడలపై, కార్ల అద్దాలపై అతుక్కునే వీటి లక్షణం ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.ఫిర్యాదులు గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. దీంతో ప్రభుత్వం రసాయనాల స్థానంలో నీటిని పిచికారీ చేయాలని, జిగురు అట్టలను ఉపయోగించాలని సూచిస్తోంది. పక్షులు ఈ పురుగులను తినడం ప్రారంభించడంతో వ్యాప్తి కొంత మేర తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!