జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!

- July 05, 2025 , by Maagulf
జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!

జెడ్డాః  సౌదీ అరేబియా ప్రధాన మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో గురువారం జెడ్డాలో అబుదాబి డిప్యూటీ పాలకుడు, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిపారు.
అల్-సలాం ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు తమ దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. వివిధ రంగాలలో వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి సంబంధించిన మార్గాలపై చర్చించారు.
ఈ మేరకు ప్లాట్ఫామ్ Xలోని తన అధికారిక ఖాతాలోని పోస్ట్లో షేక్ తహ్నౌన్ జెద్దా పర్యటన ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి రెండు దేశాల నాయకత్వాల మధ్య జరుగుతున్న సంప్రదింపులలో భాగమని తెలిపారు.
షేక్ తహ్నౌన్ ద్వైపాక్షిక, ఉమ్మడి అరబ్ ప్రాముఖ్యతపై యూఏఈ బలమైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.  ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతానికి స్థిరమైన భవిష్యత్ ను అందించడానికి నిరంతర సమన్వయంతో ముందుకు కదలాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com