3 ఏళ్లలో 65 దేశాలలో 1 బిలియన్ మీల్స్ పంపిణీ..!!
- July 05, 2025
యూఏఈః యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. 50 దేశాలలో పేదలకు ఆహార సహాయం చేసే లక్ష్యంతో 2022 రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ప్రచారాన్ని ప్రారంభించారు. జూలై 4 తో ఈ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. 65 దేశాలలో ఒక బిలియన్ మీల్స్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో 260 మిలియన్ల మీల్స్ పంపిణీ చేయనున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి చెప్పారు.
''వన్ బిలియన్ మీల్స్'' ప్రచారం గత కొన్ని ఏళ్లుగా షేక్ మొహమ్మద్ ప్రకటిస్తున్నారు. 10 మిలియన్ మీల్స్, 100 మిలియన్ మీల్స్, 1 బిలియన్ మీల్స్ ప్రచారంతో ఆ ధోరణి ముందుకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2022లో జోర్డాన్, భారతదేశం, పాకిస్తాన్, లెబనాన్, కిర్గిజ్స్తాన్, అంగోలా, ఉగాండాతో సహా 13 దేశాలలో నిరాశ్రయులైన వ్యక్తులు, కుటుంబాలతోపాటు ఆహారం అవసరమైన వారందరికి సహాయాన్ని అందించారు.
2030 నాటికి ఆకలి చావులను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 ను సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాలకు స్థిరమైన మానవతా సహాయం అందించే ప్రపంచ అవసరానికి వన్ బిలియన్ మీల్స్ ప్రచారం ప్రతిస్పందిస్తుందని యూఏఈ వెల్లడించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







