ఫుజైరాలో బీచ్‌కి వెళ్లేవారికి సేఫ్టీ టిప్స్..ప్రమాదాలపై ఆందోళన..!!
- July 05, 2025
యూఏఈ: ఫుజైరా రెస్క్యూ బృందాలు గత సంవత్సరం ఎమిరాటీలు, ప్రవాసులు సహా 26 మందిని మునిగిపోకుండా కాపాడాయి. అయినా, ఒకరు మరణించిన సంఘటన నమోదైంది. వేసవిలో బీచ్ కు వచ్చేవారితో తీరప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అధికారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లు, పడవ లాంటి రక్షణలు ఉన్న చోటనే సముద్రంలోకి దిగాలని సూచించారు.
ఈ సందర్భంగా కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు:
-బోటింగ్ చేసేటప్పుడు లేదా ఆఫ్‌షోర్‌లో ఈత కొట్టేటప్పుడు ఎల్లప్పుడూ లైఫ్ జాకెట్లు ధరించాలి.
-పర్యవేక్షణ లేని లేదా నిషేధించబడిన ప్రాంతాలకు దూరంగా ఉండండి.
-బయటకు వెళ్లే ముందు సముద్ర వాతావరణ అప్డేట్ లను తెలుసుకోవాలి.
- పిల్లలను నీటి దగ్గర ఎప్పుడూ పర్యవేక్షణ లేకుండా వదిలివేయవద్దు.
తాజా వార్తలు
- ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్‌లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







