‘బకాసుర రెస్టారెంట్’ టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్..
- July 05, 2025
క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బకాసుర రెస్టారెంట్’, వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్జే మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మాణంలో ఎస్జే శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. వికాస బడిస సంగీత దర్శకత్వంలో ఈ ర్యాప్ సాంగ్ ని రోల్ రైడ రాయగా వికాస బడిస, రోల్ రైడ కలిసి పాడారు.
సాంగ్ రిలీజ్ అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలి అని అన్నారు.
డైరెక్టర్ మాట్లాడుతూ.. హంగర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..