రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నేప్-2025 సదస్సు
- July 06, 2025
విజయవాడ: నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తుందని, ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ శిష్ట్లా తెలిపారు.ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేషనల్ నియోనెటాలజీ ఫోరం సహకారంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేప్-2025 పేరుతో నియోనేటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ సదస్సు జరిగింది. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో డాక్టర్ రామ్ ప్రసాద్ తదితర నిపుణులు ప్రసంగించారు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన అనేక నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని రామ్ ప్రసాద్ అన్నారు. ఆధునిక వైద్య చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. ఆ క్రమంలోనే, గత పదేళ్లుగా ‘నేప్’ సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన అత్యవసర చికిత్సల్లో అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సమస్యను నిర్ధారించుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, సకాలంలో చికిత్సనందించడం కీలకాంశాలుగా నిలుస్తాయని తెలిపారు. నియోనేటల్, పీడియాట్రిక్ విభాగాల్లోని నవీన చికిత్సా విధానాలపై నైపుణ్యం సాధించి, రోగులకు మరింత మెరుగ్గా సేవలందించాలని డాక్టర్ రామ్ ప్రసాద్ సూచించారు. అనంతరం, రెయిన్బో విజయవాడ ఫెసిలిటీ డైరెక్టర్, నేప్-2025 నిర్వాహకులు డాక్టర్ వి. ప్రసాద్ మాట్లాడుతూ వివిధ విభాగాల వైద్య నిపుణులు, సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితులను సక్రమంగా నిర్వహించవచ్చని, రాష్ట్రంలోని మరెక్కడా లేని విధంగా, కరెన్సీనగర్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యాధునిక నియోనేటల్, పీడియాట్రిక్ విభాగాలున్నాయని వెల్లడించారు. రెయిన్బోలో పీడియాట్రిక్ పల్మనాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ రుమటాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలతో పాటు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నియోనేటల్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ విభాగాలున్నాయని పేర్కొన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లోని అత్యవసర చికిత్సా విభాగంలో అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. దాదాపు 400 మంది నియోనెటాలజిస్టులు, పీడియాట్రీషియన్లు హాజరైన ఈ నేప్-2025 కార్యక్రమంలోలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన వివిధ విభాగాల నిపుణులు సంబంధిత అంశాలపై ప్రసంగించారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, వివిధ రకాల చికిత్సల గురించి నిపుణులు విశ్లేషణాత్మకంగా ఉపన్యసించారు. సంబంధిత అంశాలపై సభ్యుల సందేశాలను వారు నివృత్తి చేశారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల, ఇంటెన్సివ్ కేర్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మార్గదర్శనంలో ఈ సీఎంఈ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఎస్.సి.పి.రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ వీణ అక్కినేని, డాక్టర్ శ్రీకాంత్ దోమల, డాక్టర్ శివ సత్య ప్రసూన్ కొర్రపాటి, టి.రమేష్ కుమార్, డాక్టర్ హేమకుమార్, డాక్టర్ బ్రజేష్నా, డాక్టర్ జి. పూజ, డాక్టర్ బి. పవన్ కుమార్, డాక్టర్ వైభవ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..