ఫుజైరా మ్యూజిక్ రోడ్.. మరో 6 అరుదైన మార్గాలు..!!
- July 06, 2025
యూఏఈః రోడ్లు గుర్తుకువచ్చినప్పుడల్లా.. ట్రాఫిక్ జామ్లు, పొడవైన టెయిల్బ్యాక్లు మాత్రమే గుర్తుకు వస్తాయా? యూఏఈలో వాస్తవానికి కొన్ని ఆసక్తికరమైన రోడ్లు ఉన్నాయి. అవి కేవలం ప్రయాణం గురించి కాదని, అవి మధుల అనుభవం అనేలా ఉంటాయి. దుబాయ్ నుండి షార్జా వరకు, మరియు రస్ అల్ ఖైమా నుండి ఫుజైరా వరకు ఇలాంటి కొన్ని రోడ్లు మీకు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటి వరకు వెళ్లకపోతే.. ఒకసారి సందర్శించండి.
ఫుజైరా మ్యూజిక్ రోడ్
బీథోవెన్ తొమ్మిదవ సింఫనీలో కొంత భాగాన్ని వినిపిస్తుంది. ఈ రహదారి ఇటీవల వైరల్ అయింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంచి ట్యూన్ వినడం ఇష్టమా? మీరు షేక్ ఖలీఫా స్ట్రీట్లోని రంబుల్ స్ట్రిప్స్పై డ్రైవ్ చేసినప్పుడు, మీ కారును వాయిద్యంగా చేసుకుని సంగీతాన్ని సృష్టించడంలో మీరు భాగం కావచ్చు. ఫుజైరా పోలీస్ హెడ్క్వార్టర్స్ ముందు ఏర్పాటు చేయబడిన దాదాపు 1 కి.మీ పొడవున్న మ్యూజికల్ స్ట్రీట్లో ప్రజలు అనుభవం కోసం చివరి లేన్కు మారుతున్నారు. అయితే, భద్రతను దృష్టిలో పెట్టుకొని క్రమంగా లేన్లను మార్చాలని అధికారులు సూచిస్తున్నారు.
దుబాయ్లోని హాఫ్-డెసర్ట్ రోడ్
యూఏఈ ఎడారి దేశం. కాబట్టి డ్రైవ్ చేయడం వల్ల రెండు వైపులా ఇసుక దిబ్బలు ఉన్న అనేక రోడ్లు మనకు కనిపిస్తాయి. అయితే, ఈ ప్రత్యేక రహదారిలో మీరు ఎడారికి వెళ్లరు..ఎడారే మీ వద్దకు వస్తుంది. దుబాయ్లోని హాఫ్ ఎడారి. పేరుకు తగ్గట్లుగా బలమైన గాలుల కారణంగా సమీపంలోని దిబ్బల నుండి రోడ్డుకు ఇసుకను తెస్తుంది. ఈ ప్రాంతం గుండా వెళ్లే వారు ఏడారిలో వెళ్లిన అనుభవాన్ని పొందవచ్చు.
ఖోర్ ఫక్కన్ టన్నెల్స్
మీరు ఎప్పుడైనా పర్వతం కిందకు వెళ్ళారా? వరుసగా ఐదు టన్నెల్స్ వస్తే ఎలా ఉంటుంది? యూఏఈలోఇది సాధ్యమే. షార్జా-ఖోర్ ఫక్కన్ రహదారిపై ఈ టన్నెల్స్ ఉన్నాయి. ఇందులో 2.7 కి.మీ అల్ సిద్రా టన్నెల్ ప్రత్యేకం. ఇది మధ్యప్రాచ్యంలో అతి పొడవైన టన్నెల్ గా పేరుంది. మరో నాలుగు టన్నెల్స్ 1.4 కి.మీ వద్ద అల్ సకాబ్, 1.3 కి.మీ వద్ద అల్ రౌగ్, 0.9 కి.మీ వద్ద అల్ గజీర్ మరియు 0.3 కి.మీ వద్ద అల్ సహాహ్ ఉన్నాయి. ఇక అల్ షిందాఘా టన్నెల్ గురించి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, దుబాయ్ క్రీక్ కింద ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతం. 1975లోనే ప్రారంభించారు. ఇది ఎమిరేట్స్లోని పురాతన టన్నెల్.
వాడి అల్ కోర్
రస్ అల్ ఖైమాలోని వాడి అల్ కోర్ సాధారణ రహదారి కాదు.ఇది ఆఫ్-రోడ్ అనుభవాలను అందిస్తుంది. తరచుగా "లాస్ట్ ట్రైల్" అని పిలువబడే ఈ ప్రదేశానికి వచ్చే సందర్శకులు తమ ప్రయాణమంతా కప్పల కోరస్ విన్నట్లు ఉంటుందని చెబుతారు. అందుకే దీనికి "వాడి ఆఫ్ ఫ్రాగ్స్" అనే పేరు వచ్చింది.ఈ మార్గం ఒక నదీగర్భంలో వెళుతుంది. మార్గంలో నీరు కనిపించి సందడి చేస్తుంది. అదే సమయంలో పర్వతాల సైడ్ సీనరీ ఆకట్టుకుంటుంది.
ఫ్లోటింగ్ బ్రిడ్జి
తేలియాడే వంతెన..నీటిపై నిర్మించబడిన బ్రిడ్జి. అలల కదలికలో మార్పులతో అది కొద్ది ఊగుతున్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు వారు నడుపుతున్నప్పుడు కొద్దిగా 'అలల చర్య'ను అనుభవించవచ్చు.ఈ బ్రిడ్జి ట్రాఫిక్ కు అనుగుణంగా ప్రతిరోజూ తెరిచి, మూసివేస్తుంటారు. అయితే, ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రస్తుతం నిర్వహణ కోసం మూసివేసినట్లు ఆర్టీఏ తెలిపింది. త్వరలోనే మరింత కొత్త అనుభవంతో ప్రారంభమవుతుందని వెల్లడించింది.
జీరో-గ్రావిటీ రోడ్?
ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో " జీరో-గ్రావిటీ " ని అనుభవించినట్లు కొందరు ప్రయాణికులు చెబుతుంటారు. అక్కడ కారు పైకి ఎగురుతున్నట్లు అనిపిస్తుందట. ఈ రోడ్లు ఎత్తుపైకి వెళ్తున్నట్లు కనిపిస్తాయి. వాస్తవానికి, అవి క్రిందికి వాలుగా ఉంటాయి. మీరు స్వయంగా వెళితే ఆ గురుత్వాకర్షణను ఆస్వాదించవచ్చని చెబుతుంటారు. నిజం తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నించండి. ఇలాంటి మరో రోడ్ ఒమన్లో, మీర్బాత్ - సలాలా మధ్య మార్గంలో ఉంటుంది. ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'