అమెజాన్ బేసిన్‌లో 94 మంది అరెస్ట్..$64 మిలియన్ల ఆస్తులు సీజ్..!!
- July 09, 2025
యూఏఈ: అమెజాన్ బేసిన్‌లో పర్యావరణ నేరాలపై యూఏఈ ఉక్కుపాదం మోపింది. 94 మంది అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు $64 మిలియన్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌లో ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తెలిపారు.ఆపరేషన్ గ్రీన్ షీల్డ్ లో భాగంగా అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు.కొలంబియా, బ్రెజిల్, పెరూ,ఈక్వెడార్‌ల సమన్వయంతో యూఏఈ 14 రోజులపాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు.
2023లో దుబాయ్‌లో జరిగిన COP28 వాతావరణ సమావేశంలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) భాగస్వామ్యంతో యూఏఈ గ్లోబల్ ఇనిషియేటివ్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ క్లైమేట్ (I2LEC) కింద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ సంవత్సరం మే నెలలో యూఏఈ కొత్త వాతావరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024లో అల్ వాత్బాలోని రక్షిత రిజర్వ్‌లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులకు Dh165,000 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు