ఖతార్ లో కొత్త విద్యా క్యాలెండర్ కు ఆమోదం..!!
- July 09, 2025
దోహా, ఖతార్: ఖతార్ లోని పాఠశాలలకు విద్యా సంవత్సరాలు (2025–2026, 2026–2027, 2027–2028) కొత్త విద్యా క్యాలెండర్‌ను ఆమోదించినట్లు విద్య. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను సమన్వయం చేయడానికి షురా కౌన్సిల్ చేసిన ప్రతిపాదనలతో సహా వివిధ సమీక్షల తర్వాత ఈ క్యాలెండర్ ను ఆమోదించినట్లు తెలిపింది.
డిసెంబర్ చివరి మూడవ తేదీన మిడ్ టర్మ్ సెలవులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. సమగ్రమైన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొత్త క్యాలెండర్ రూపొందించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2025-2026, 2027-2028 విద్యా సంవత్సరాలకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో అధికారిక సెలవులతో పాటు విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి రెండు రోజుల అదనపు సెలవులు కొత్త క్యాలెండర్ లో ఉన్నాయి. అలాగే, ప్రతి సంవత్సరం రెండవ సెమిస్టర్ మిడ్‌టర్మ్ పరీక్షల తర్వాత సెలవులను మంత్రిత్వ శాఖ కొత్త క్యాలెండర్లో చేర్చింది. ప్రతి పరీక్ష మధ్య విద్యార్థులకు తగినంత సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇది విద్యార్థులు మానసికంగా సిద్ధం కావడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







