యూఎస్ వెళ్లాలనుకునే వారికి ట్రంప్ బిగ్ షాక్
- July 10, 2025
అమెరికా: ఉద్యోగ (హెచ్-1బీ)(H-1), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2),ఎక్స్చేంజ్ (జే)…ఏదైనా వీసా అయినా సరే…అమెరికా వెళ్ళాలనుకుంటే ఇక మీదట ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే.వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింద అదనంగా 250 డాలర్లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా అమలు చేసిన వన్ బిగ్ బ్యూటిపుల్ చట్టం కింద ఈ వీసా ఫీజులు కూడా అమలు కానున్నాయి. అంతే కాదు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజుల్లో మార్పులు చోటు కూడా చేసుకుంటాయి.
తడిసిమోపెడవనున్న వీసా ఛార్జీలు..
వీసా జారీ చేసేటప్పుడే ఈ అధిక రుసుమును అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ రుసుమును సర్‌చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది. దీంతోపాటు.. ఐ-94 సర్‌చార్జ్ 24 డాలర్లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈఎస్ టీఏ- 13 డాలర్లు, ఎలక్ట్రానిక్ వీసా అప్‌డేట్ సిస్టమ్ ఈవీయూఎస్-30 డాలర్లు కింద అదనపు రుసుములను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం వీసా ఫీజులు భారంగా మారనున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు పర్యాటక/వ్యాపార వీసాపై వెళ్లాలంటే వీసా చార్జీలుగా 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.15,855. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్‌లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే ఇప్పుడు అది ఏకంగా 472 డాలర్లకు అంటే రూ.40,456 గా అవనుంది.
US వీసాతో ఎన్ని దేశాలను సందర్శించవచ్చు?
- US వీసా, ప్రత్యేకంగా బహుళ-ప్రవేశ B1/B2 వీసా, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రత్యేక వీసా అవసరం లేకుండా అనేక ఇతర దేశాలలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దేశాలలో కరేబియన్, మధ్య మరియు దక్షిణ అమెరికా మరియు తూర్పు ఐరోపాలోని దేశాలు ఉన్నాయి.
- B1 మరియు B2 వీసాలు అంటే ఏమిటి?
- B1 మరియు B2 వీసాల మధ్య తేడా ఏమిటి?
- B1 మరియు B2 వీసాలు తాత్కాలిక బసల కోసం యునైటెడ్ స్టేట్స్ జారీ చేసిన వలసేతర వీసాలు. B1 వీసా వ్యాపార ప్రయోజనాల కోసం, అయితే B2 వీసా పర్యాటకం, వినోదం లేదా వైద్య చికిత్స కోసం. అవి తరచుగా కలిపి B1/B2 వీసాగా జారీ చేయబడతాయి, ఇది వ్యాపారం మరియు విశ్రాంతి ప్రయాణాలకు అనుమతిస్తుంది.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు