నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- October 14, 2025
మనామాః హమద్ నగరంలో నాలుగున్నర సంవత్సరాల చిన్నారి వాహనం లోపల విషాదకరంగా మరణించిన సంఘటన అందరిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ మరణానికి లైసెన్స్ లేని వాహనం కారణమని ప్రాథమిక దర్యాప్తులో నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అధికారులు తేల్చారని తెలిపింది. విద్యార్థి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేశామని, తదుపరి చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. విద్యార్థుల రవాణాకు అధికారిక లైసెన్స్ పొందిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







