ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- October 14, 2025
షర్మ్ ఎల్-షేక్, ఈజిప్ట్ః ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ అమలులోకి రావడంతో గాజా భవిష్యత్తుపై ఉన్నత స్థాయి చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షర్మ్ ఎల్-షేక్ కు వచ్చారు. ఈ కార్యక్రమంలో 20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గాజా శాంతి సదస్సుకు హాజరైన వారిలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగన్, యుకె మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ మరియు సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సీనియర్ అధికారులు ఉన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై అధికారికంగా ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్-సిస్సీ, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సంతకాలు చేశారు. ఈజిప్టులో జరిగిన సంతకాల చర్చలకు ఇజ్రాయెల్ మరియు హమాస్ ప్రతినిధులు గైర్హాజరు అయ్యారు. అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ కారణంగా గాజాలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







