టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి - చంద్రబాబు మదిలో ఆ ఇద్దరు ఎవరు?

- July 10, 2025 , by Maagulf
టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి - చంద్రబాబు మదిలో ఆ ఇద్దరు ఎవరు?

అమరావతి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది.ఈ మేరకు టీడీపీకి ఇప్పటి కే సమాచారం ఇచ్చింది.ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరిం చిన టీడీపీకి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉండగా..పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కను న్నట్లు తెలుస్తోంది.

టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమా చారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది.అశోక్ గజపతి రాజు,యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు.ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు.అశోక్ గజపతి రాజు కేంద్రంలో నూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com