35.3 మిలియన్లకు సౌదీ జనాభా..ఎక్కువ మంది 65 ఏళ్లలోపువారే..!!
- July 11, 2025
రియాద్: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, 2024లో సౌదీ అరేబియా మొత్తం జనాభా 35,300,280కి చేరుకుంది. మొత్తం జనాభాలో, 55.6 శాతం మంది సౌదీ జాతీయులు, సౌదీయేతరులు 44.4 శాతం మంది ఉన్నారు.
జనాభాలో పురుషులు 62.1 శాతం మంది, 37.9 శాతం మంది మహిళలు ఉన్నారు. జనాభాలో 15 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 74.7 శాతం ఉండగా, 0 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 22.5 శాతం ఉన్నారు. 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులు కేవలం 2.8 శాతం ఉన్నారు. “సౌదీ అరేబియా జనాభా... గణాంకాలు, స్థిరమైన ప్రభావం” అనే థీమ్ కింద విడుదల చేసిన ఈ డేటా.. రాజ్యం జనాభా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. యువత జనాభా ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిని అందిస్తుంది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!