భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!
- July 11, 2025
కువైట్: భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. మంత్రి షేక్ ఫహద్తో జరిగిన సమావేశంలో భారత రాయబారి భద్రత, నేరాలు, నైపుణ్య మార్పిడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. భారత రాయబారి ముఖ్యమైన ద్వైపాక్షిక పరిణామాలను మంత్రికి వివరించారు. కువైట్లోని భారతీయ డయాస్పోరా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!