సెలవును కోల్పోయిన మాజీ ఉద్యోగికి Dh59,000 పరిహారం..!!

- July 11, 2025 , by Maagulf
సెలవును కోల్పోయిన మాజీ ఉద్యోగికి Dh59,000 పరిహారం..!!

యూఏఈ: అబుదాబిలోని కాసేషన్ కోర్టు 13 సంవత్సరాల పాటు వార్షిక సెలవులను వినియోగించుకోని ఎంప్లాయికి పరిహారం చెల్లించాలని యజమానిని ఆదేశించింది. ఈ కేసులో 2009 నుండి జూన్ 2022లో తన ఒప్పందం ముగిసే వరకు కంపెనీలో పనిచేసిన సదరు ఉద్యోగి తన పదవీకాలంలో అర్హత కలిగిన వార్షిక సెలవును ఎప్పుడూ తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇందుకు గాను ఆర్థిక పరిహారం అందజేయాలని కోరాడు. అయితే, యజమాని సెలవులు తీసుకున్నట్లు ఏ డాక్యుమెంటేషన్‌ను అందజేయలేదు.  దాంతో సదరు ఉద్యోగికి Dh59,290 పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

అంతకుముందు, కేసు నంబర్ 2024/73లో దిగువ కోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ పరిహారాన్ని గరిష్టంగా రెండు సంవత్సరాల వార్షిక సెలవులకే పరిమితం చేసింది. అయితే, కాసేషన్ కోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసి, మొత్తం కాలానికి పూర్తి పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు హబీబ్ అల్ ముల్లా అండ్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ హబీబ్ అల్ ముల్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ తీర్పు యూఏఈలో ఉపయోగించని సెలవులకు సంబంధించిన కార్మిక వివాదాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు.  డిసెంబర్ 2024లో కాసేషన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించిందని తెలిపారు. అలాగే, కొచ్చర్ & కో. ఇంక్. లీగల్ కన్సల్టెంట్స్ (దుబాయ్ బ్రాంచ్)లో సీనియర్ అసోసియేట్ నవన్‌దీప్ మట్టా ఈ నిర్ణయాన్ని యూఏఈ ఉపాధి చట్టంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.  

2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 33లోని ఆర్టికల్ 29 మరియు 2022 క్యాబినెట్ తీర్మాన నంబర్ 1 ప్రకారం.. ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగించని సెలవులకు చట్టబద్ధంగా పరిహారం పొందేందుకు అర్హులు అని మట్టా వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com