‘VISA- వింటారా సరదాగా’ టీజ‌ర్..

- July 12, 2025 , by Maagulf
‘VISA- వింటారా సరదాగా’ టీజ‌ర్..

హీరో మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు మ‌హేశ్‌బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్‌. నూతన దర్శకుడు ఉద్భవ్ డైరెక్ష‌న్‌లో ‘వీసా- వింటారా సరదాగా’ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఎన్నో క‌ల‌ల‌తో అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్ర‌యాణ‌మే ఈ చిత్ర క‌థాంశంగా టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com