దుబాయ్ విమానాశ్రయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- July 13, 2025
దుబాయ్: తజికిస్తానీ గాయకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్‌ను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు రోజిక్ కంపెనీ నిర్వాహకుడు తెలిపాడు. మోంటెనెగ్రో నుండి దుబాయ్ చేరుకున్న కొద్దిసేపటికే అతడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాడు.కాగా, దీనిపై అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. “దొంగతనం ఆరోపణలపై అతన్ని అదుపులోకి తీసుకున్నారని మాకు తెలుసు అని మాత్రమే మేము చెప్పగలం” అని కంపెనీ ప్రతినిధి స్పష్టత ఇచ్చాడు. కానీ మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించాడు.
గ్రోత్ హార్మోన్ లోపం కారణంగా మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగలేకపోయిన రోజిక్..అత్యంత గుర్తింపు పొందిన యువ ప్రముఖులలో ఒకరు. అతను యూఏఈ గోల్డెన్ వీసాను కలిగి ఉన్నాడు.చాలా సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. బిగ్ బాస్ 16తో సహా అతని సంగీతం, వైరల్ వీడియోలు, రియాలిటీ టెలివిజన్ ప్రదర్శనల ద్వారా ప్రజాదరణ సాధించారు.
2024లోరోజిక్ దుబాయ్‌లోని కోకా-కోలా అరీనాలో బాక్సింగ్‌లో అరంగేట్రం చేశాడు. యూకేలో తన రెస్టారెంట్ బ్రాండ్ హబీబీని ప్రారంభించాడు. అదే సంవత్సరం ఒక హాస్పిటాలిటీ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అతన్ని ప్రశ్నించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!