కువైట్‌లో కార్మికుల సంఖ్య 1.8 మిలియన్‌

- July 15, 2016 , by Maagulf
కువైట్‌లో కార్మికుల సంఖ్య 1.8 మిలియన్‌
 


కువైట్‌లో కార్మికుల సంఖ్య 1.8 మిలియన్లుగా ఉందని తాజా లెక్కలు తేల్చాయి. సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ బ్యూరో ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 1.8 మిలియన్ల మందిలో 344,600 మంది కువైటీలు కాగా, మిగతావారంతా నాన్‌ కువైటీస్‌ ఉన్నట్లు తేలింది. డిసెంబర్‌ 2015 లెక్కలతో పోల్చితే కువైటీ పురుష కార్మికుల సంఖ్య 10.3 శాతం పెరిగితే కువైటీ మహిళా కార్మికులు 54.8 శాతం పెరిగింది. ప్రభుత్వ సెక్టార్‌లో ఉద్యోగుల సంఖ్య 373,000గా ఉన్నారు. ఇందులో కువైటీలు 73.6 శాతం కాగా, నాన్‌ కువైటీలు 26.4 శాతం. ప్రైవేటు సెక్టార్‌లో 1.4 మిలియన్‌ ఉద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నవారు. నాన్‌ కువైటీ లేబర్‌ ఫోర్స్‌లో 89.7 శాతం పురుషులు, మహిళా కార్మికుల శాతం 42.5 శాతం (రిజిస్టర్‌ చేసుకున్నవారు). కువైట్‌లో ఉన్న కార్మికుల్లో ఎక్కువ శాతం ఇండియన్లే. వీరి శాతం 25.8 శాతంగా ఉంది. ఈజిప్టియన్ల సంఖ్య 23.3 శాతం ఉండగా, కువైటీల సంఖ్య 18.6 శాతం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com