తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తణిఖీలు
- July 15, 2025
తిరుమల: తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాల నిర్వహణ పై మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తణిఖీలు నిర్వహించారు.
శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్, బోర్డు సభ్యులు అక్కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు.తిరుమలలో త్రాగునీరు, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, అన్నదానంలో అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ,జంగా కృష్ణమూర్తి,శాంతా రామ్,నరేష్ కుమార్, జానకీ దేవి, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..