దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!

- July 16, 2025 , by Maagulf
దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!

యూఏఈ: దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌లో నిర్మాణ పనుల మధ్య నగరంలోని కీలక ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపుల గురించి దుబాయ్ RTA ఒక ప్రకటనలో వాహనదారులకు అలెర్ట్ జారీ చేసింది.  మిర్దిఫ్‌లో ట్రాఫిక్ మళ్లింపుల గురించి అధికారులు హెచ్చరించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు

-సిటీ సెంటర్ మిర్దిఫ్ సమీపంలోని 5వ,  8వ వీధి మధ్య రౌండ్అబౌట్ కూడలి మూసివేస్తారు. 5వ నుండి 8వ వీధి వరకు సిటీ సెంటర్ మిర్దిఫ్ వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇక 8వ వీధి నుండి 5వ వీధి వరకు అల్జీరియా వీధి వైపు ట్రాఫిక్ డైవెర్షన్స్ అమల్లో ఉంటాయి.

-సిటీ సెంటర్ మిర్దిఫ్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం 'ఘోరూబ్ స్క్వేర్' సమీపంలో నివసించేవారికి U-టర్న్ తో, మాల్ సందర్శకుల కోసం పార్కింగ్ ప్రాంతానికి RTA ప్రత్యామ్నాయ యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేసింది.

గత నెలలో దుబాయ్ రూలర్ బ్లూ లైన్ మొదటి మెట్రో స్టేషన్‌కు పునాది రాయి వేశారు.  సెప్టెంబర్ 9, 2029 నుండి ప్రయాణీకులకు ఇది అందుబాటులోకి రానున్నదని ప్రకటించారు.  ఈ సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన మెట్రో స్టేషన్ అయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ స్టేషన్ డిజైన్ ను ఆవిష్కరించారు. 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో 14 స్టేషన్లతో సహా ఐకానిక్ దుబాయ్ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ దాని నెట్‌వర్క్‌లో 28 రైళ్లను కలిగి ఉంటుంది. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌ను 78 స్టేషన్లు, యు 131 కి.మీ.లకు పెరగనుంది. 56 మిలియన్ డాలర్లకు పైగా లాభాలను ఆర్జించనున్న ఈ Dh20.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ 2030లో 200,000 మంది ప్రయాణికులను తీసుకువెళుతుందని,  2040 నాటికి 320,000 మంది ప్రయాణికులకు పెరుగుతుందని భావిస్తున్నారు. కొత్త లైన్ నగరంలోని మిర్దిఫ్, అల్ వార్కా, ఇంటర్నేషనల్ సిటీ 1 అండ్ 2, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అకాడెమిక్ సిటీ, రాస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా, దుబాయ్ క్రీక్ హార్బర్ , దుబాయ్ ఫెస్టివల్ సిటీలను కలుపనుంది.  ఈ మార్గంలో ప్రయాణ సమయం 10 నుండి 25 నిమిషాల మధ్య ఉంటుందన్నారు.

దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌లో 14 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మూడు గ్రీన్ లైన్‌లోని అల్ జద్దాఫ్‌లోని క్రీక్ స్టేషన్, రెడ్ లైన్‌లోని అల్ రషీదియాలోని సెంటర్‌పాయింట్ స్టేషన్, బ్లూ లైన్‌లోని ఇంటర్నేషనల్ సిటీ 1 స్టేషన్, దుబాయ్ క్రీక్ హార్బర్‌లో ఉన్న ఐకానిక్ స్టేషన్‌ ఇంటర్‌చేంజ్ స్టేషన్లుగా ఉండనున్నాయి.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com