అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!

- July 16, 2025 , by Maagulf
అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!

యూఏఈ: అబుదాబి విద్యా నియంత్రణ సంస్థ ఎమిరేట్‌లోని 12 ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంది. వాటిల్లో 11, 12 తరగతుల విద్యార్థులను నమోదు చేసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. విద్యా రికార్డులలో మ్యానిఫులేషన్ ఆరోపణల నేపథ్యంలో అబుదాబి విద్యా విభాగం (ADEK) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉన్నత పాఠశాలల విద్యార్థుల పనితీరు, లెర్నింగ్ నాణ్యతకు సంబంధించి సమీక్షలు కొనసాగుతాయని తెలిపింది.  విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీస్ లను తప్పుగా నమోదు చేయడం విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com