కువైట్ లో ప్రత్యేక తనిఖీలు.. 437 ఉల్లంఘనలు, 32మంది అరెస్ట్..!!

- July 18, 2025 , by Maagulf
కువైట్ లో ప్రత్యేక తనిఖీలు.. 437 ఉల్లంఘనలు, 32మంది అరెస్ట్..!!

కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రత, ట్రాఫిక్ ప్రచారాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రజా భద్రతను పెంపొందించడానికి, శాంతిభద్రతలను నిర్ధారించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. కువైట్  మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.

ట్రాఫిక్ వ్యవహారాలు , ఆపరేషన్స్ సెక్టార్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్‌తో కలిసి నిర్వహించిన ఈ ప్రచారంలో 437 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వివిధ చట్టపరమైన ఉల్లంఘనలకు సంబంధించి 32 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన తొమ్మిది మంది వ్యక్తులు, ఆరుగురు వాంటెడ్ వ్యక్తులతోపాటు గుర్తింపు పత్రాలు లేని నలుగురు వ్యక్తులు ఉన్నారు.

అలాగే,  లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు అనుమానిత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పరారీలో ఉన్న ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు.  దేశంలోని అన్ని ప్రాంతాలలో భద్రతా ప్రచారాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అన్ని చట్టాలతోపాటు ట్రాఫిక్, నివాస నిబంధనలను పాటించాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com