తిరుమలలో పాత భవనాల రూపురేఖలు మార్చాలి: టీటీడీ ఈవో

- July 18, 2025 , by Maagulf
తిరుమలలో పాత భవనాల రూపురేఖలు మార్చాలి: టీటీడీ ఈవో

తిరుమల: తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. 

అంతకుముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం(ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణం పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com