'కబాలి' నాణేలను విడుదల ...
- July 15, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కబాలి' చిత్రం రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రజినీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీల ద్వారా సరఫరా చేయడానికి ఆ సంస్థఒప్పందం కుదుర్చుకుందట. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. 'కబాలి' నాణేలను విడుదల చేసిన కార్యక్రమంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'ఈ వెండి నాణేలు 5 గ్రాములు(రూ. 350), 10 గ్రాములు(రూ. 700), 20 గ్రాములు(రూ. 1400) చొప్పున లభిస్తాయి. శుక్రవారం నుంచి ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు, కానీ చిత్రం విడుదల తర్వాతే ఇవి అందుతాయి' అని ముత్తూట్ అధికారి కెయూర్ షా తెలిపినట్లు సమాచారం.
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రాధికాఆప్టే నటించారు. ఈ నెల 22న 'కబాలి' ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







