స్పీల్ బర్గ్ తో ఒక్క ఫొటో దిగితే అదే తనకు బిగ్ రెమ్యూనరేషన్..
- July 15, 2016
'కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత నా వాయిస్ లో ఉన్న మాస్ ఇమేజ్ ను గుర్తించింది రాంగోపాల్ వర్మ. కథేంటో.. సినిమా ఏంటో కూడా పెద్దగా తెలీదు. కానీ హాలీవుడ్ దర్శకదిగ్గజం స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ కావడంతో డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నాను' అని టాలీవుడ్ నటుడు జగపతిబాబు అన్నారు. బేసిక్ గా తాను యానిమేషన్ మూవీలు చూడనని, అలాంటి తరహా సినిమాల కంటే రియాల్టీ ఉండే వాటినే చూస్తానని చెప్పుకొచ్చాడు.స్పీల్బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం 'ది బిఎఫ్జి'. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ మూవీలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తాను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నాడు. కేవలం దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ తో ఒక్క ఫొటో దిగితే అదే తనకు బిగ్ రెమ్యూనరేషన్ అని పేర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన బెస్ట్ డబ్బింగ్ అవకాశమని, ఆ ప్రాజెక్టులో తాను భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.అయితే తన డ్రీమ్(స్పీల్ బర్గ్ తో ఫొటో దిగడం) ఇంకా పూర్తి కాలేదన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తండ్రి పాత్రలో, క్రేజ్ ఉన్న విలన్ పాత్రల్లో మెప్పిస్తోన్న జగపతి, తనకు చాలా డిమాండ్ ఉన్నా హాలీవుడ్ దర్శకుడిపై ఉన్న అభిమానంతోనే పారితోషికం తీసుకోనని చెప్పడం విశేషం.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









