దుబాయ్-కోజికోడ్ సర్వీస్ రద్దు..4 గంటల పాటు నరకం..!!

- July 19, 2025 , by Maagulf
దుబాయ్-కోజికోడ్ సర్వీస్ రద్దు..4 గంటల పాటు నరకం..!!

యూఏఈ: శుక్రవారం ఉదయం కోజికోడ్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఉన్న ప్రయాణికులు నాలుగు గంటలకు పైగా విమానంలోనే ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కానీ చివరకు ఫ్లైట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు దుబాయ్ నుండి బయలుదేరాల్సిన విమానం IX 346 ఉదయం 8.15 గంటలకు ఫ్లైట్ లోకి అనుమతించారని ప్రయాణికులు తెలిపారు.అయితే, ఆ తర్వాత ఎయిర్ కండిషనింగ్, అప్‌డేట్‌లు లేకపోవడం, నిరాశతో టార్మాక్‌పై చాలాసేపు బాధాకరంగా వేచి ఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. చివరకు మధ్యాహ్నం 12.15 గంటలకు, వివిధ కారణాల వల్ల సర్వీస్ ను రద్దు చేయబడిందని సమాచారం అందించి, వారిని ఫ్లైట్ దిగాలని ప్రయాణికులకు తెలిపారు.   వీటికి సంబంధించిన వీడియోలను ప్రయాణికులు తమ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.   చివరకు ఎయిర్‌లైన్స్ వాళ్లు మమ్మల్ని ఒక హోటల్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని, తదుపరి విమానం జూలై 19న తెల్లవారుజామున 3.40 గంటలకు (భారతదేశ సమయం) మాత్రమే ఉంటుందని తమకు చెప్పారని పలువురు ప్రయాణికులు తెలిపారు.

మరోవైపు, తిరువనంతపురం నుండి అబుదాబికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 523 కూడా దాదాపు గంటన్నరపాటు ఆలస్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) విమానం బయలుదేరాల్సి ఉండగా, కానీ అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరింది. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన రెండు విమాన సర్వీసులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించినవి కావడం గమనార్హం.

అదే విధంగా, గురువారం జైపూర్ నుండి దుబాయ్ వెళ్లే విమానాన్ని కూడా ఎయిరిండియా రద్దు చేసింది.అంతకుముందు, ప్రయాణికులు గంటల తరబడి ఫ్లైట్ కోసం వేచి ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ నుండి జైపూర్‌కు వచ్చే విమానం కూడా అధికారులు రద్దు చేశారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, జూన్ నుండి దాదాపు 30 కి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్ రద్దు చేసింది. గత నెలలో దుబాయ్ - లక్నో మధ్య వరుసగా మూడు రోజులపాటు సర్వీసులను రద్దు చేసిన ఘటన నమోదైంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com