'కబాలి' పైరసీ నిలిపివేత

- July 15, 2016 , by Maagulf
'కబాలి' పైరసీ నిలిపివేత

ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాకు సంబంధించి నిర్మాత కలైపులి థాను దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాను ఇంటర్నెట్ ద్వారా అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 169 సర్వీస్ ప్రొవైడర్లు, 225 వెబ్‌సైట్లను సినిమా రీలిజ్ నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com