హైదరాబాద్‌లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'

- July 20, 2025 , by Maagulf
హైదరాబాద్‌లో ఆగస్టు 10న \'రన్ ఫర్ SMA–2025\'

హైదరాబాద్‌: స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ(SMA) బాధిత కుటుంబాలకు మద్దతుగా పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ క్యూర్ SMA ఇండియా ఫౌండేషన్ నిర్వహించే "రన్ ఫర్ SMA–2025" మూడవ ఎడిషన్ ఈ ఏడాది ఆగస్టు 10, ఆదివారం గచ్చిబౌలిలోని స్టేడియంలో జరుగనుంది.

ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ జాయింట్ CP ట్రాఫిక్ డా.గజరావు భూపాల్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించి, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య, పరిశోధనా నిపుణులు డా.రాధా రామా దేవి (సీనియర్ జెనెటిసిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్), డా.గిరిరాజ్ చందక్ (CSIR–CCMB మాజీ చీఫ్ సైంటిస్ట్), నవేద్ ఆలం ఖాన్ (CEO, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్), క్యూర్ SMA ట్రస్టీలు శ్రీలక్ష్మి నలం, అర్చనా తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా కమిషనర్ అవినాష్ మోహంతీ మాట్లాడుతూ, "SMA వంటి జెనెటిక్ వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వచ్చినా, అవి చాలా ఖరీదైనవి.అందుకే అవగాహన, ప్రారంభ దశలో స్క్రీనింగ్ ఎంతో ముఖ్యమైనవి.ఈ రన్ వంటి కార్యక్రమాలు ప్రజలలో చైతన్యం పెంచేందుకు దోహదపడతాయి" అని అన్నారు.అలాగే, అధికారిక పోస్టర్ మరియు టీషర్ట్‌ను కూడా ఆవిష్కరించారు.

శ్రీలక్ష్మి నలం, క్యూర్ SMA ఇండియా సహవ్యవస్థాపకురాలు మాట్లాడుతూ, "ఇండియాలో అరుదైన వ్యాధుల బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక సహకారం అందించాలంటే వైద్యులు, పరిశోధకులు, కార్పొరేట్లు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి" అని పేర్కొన్నారు.

రన్ ఫర్ SMA కార్యక్రమం ఆగస్టు నెలలో జరుగుతున్న అంతర్జాతీయ SMA అవగాహన మాసం లో భాగంగా నిర్వహించబడుతోంది. ఈ రన్‌లో 21K, 10K, 5K టైమ్డ్ రన్ మరియు 5K నాన్ టైమ్డ్ వాక్ విభాగాలు ఉంటాయి.

క్యూర్ SMA ఇండియా ట్రస్టీలు ప్రజలందరినీ ఈ ఉద్దేశంతో ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.

📌 నమోదు లింక్:
👉 http://ifinish.in/running/runforsma

📞 వివరాల కోసం సంప్రదించండి:
👉 8885004858

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com