యూఎస్‌ వీసాతో జాగ్రత్త: ఎమిరేటీలకు సూచన

- July 15, 2016 , by Maagulf
యూఎస్‌ వీసాతో జాగ్రత్త: ఎమిరేటీలకు సూచన

మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌, ఎమిరేటీలకు యూఎస్‌ వీసాలపై పలు సూచనలు చేసింది. ఈ వేసవికి యూఎస్‌ వెళ్ళాలనుకుంటున్న ఎమిరేటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సూచనలో పేర్కొంది. వీసా ఇంటర్వ్యూ సమయంలో అప్లికేషన్లలో ఏ వివరాలైతే పేర్కొన్నారో, యూఎస్‌ వెళ్ళాక అక్కడ కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నించినప్పుడు అవే వివరాల్ని వెల్లడించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. చిన్ని చిన్న తప్పులకూ ఆస్కారం కల్పించరాదని, ఏ చిన్న తప్పు దొర్లినా యూఎస్‌లో ఇబ్బందులు తప్పవని మినిస్ట్రీ వర్గాలు సూచించాయి ఎమిరేటీలకు. మినిస్ట్రీకి చెందిన త్వాజుది సర్వీస్‌లో అమెరికాకి వెళ్ళే ఎమిరేటీలు రిజిస్టర్‌ చేయించుకోవాలని, తద్వారా అథారిటీ, రెసిడెంట్లతో అత్యవసర సమావేశాల్లో కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగపడ్తుందని అధికారులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com