డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?

- July 20, 2025 , by Maagulf
డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?

యూఏఈ: యూఏఈ నుండి బహిష్కరణ వేటుకు గురైన వారు తిరిగి యూఏఈలో అడుగు పెట్టవచ్చా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇలాంటి అరుదైన అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  బహిష్కరణకు గురైన వ్యక్తి 2021 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 29లోని ఆర్టికల్ 18 (1) ప్రకారం.. విదేశీయుల ప్రవేశం, నివాసానికి సంబంధించి యూఏఈ అధ్యక్షుడి కార్యాలయం నుండి ముందస్తు అనుమతి పొందకుండా దేశంలోకి తిరిగి ప్రవేశించే అవకాశం లేదు.    

ఒకవేళ తిరిగి ప్రవేశించాలనుకుంటే,  అతను తన పాస్‌పోర్ట్, యూఏఈ గుర్తింపు సంఖ్య (అతను యూఏఈలో నివసిస్తున్నప్పుడు జారీ చేసింది), అప్పగించడం లేదా బహిష్కరణ ఉత్తర్వు, తిరిగి రావడానికి గల ఉద్దేశ్యం వివరణాత్మక వివరణ, యూఏఈ-ఆధారిత యజమాని నుండి చెల్లుబాటు అయ్యే ఉద్యోగ ఆఫర్ వంటి అన్ని సంబంధిత పత్రాలతో పాటు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) లేదా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధికారికంగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.  దరఖాస్తును సంబంధిత అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో సపహాయం చేసేందుకు యూఏఈలో అర్హత కలిగిన చట్టపరమైన సలహాదారుడిని నియమించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com