అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు
- July 21, 2025
హైదరాబాద్ : రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, వేలాది మంది భక్తులు అమ్మ వారికి పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీర్వచనాల కోసం బోనాలు సమర్పించారు. అమ్మ వారికి భక్తి శ్రద్దలతో నైవేద్యం పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారి దర్శన కోసం వేలాది మంది భక్తులు తరలి రావటంతో మందిరం పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి. సింహవాహిని మహంకాళి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, టిపిసిసి అధ్యక్షులు ఎం.మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఎంపిలు డి.కె. అరుణ, చామ కిరణ్కుమార్రెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, మాజీ ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాజాకూర్, బిజెపి నాయకులు వీరేందర్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు లాల్దదర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారికి పూజలు నిర్వహించారు.
బోనాలు సందర్బంగా పాతబస్తీలో దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.హైదరాబాద్ పాతబస్తీలో చారిత్రాత్మక లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోతరాజుల నృత్యాలు,పలు రకాల వేష ధారణాలు, డప్పుల చప్పుళ్లతో లాల్ దర్వాజ ఆలయం ప్రాంగణం శోభా యమానంగా కనిపిం చింది. ఉత్సవాలను తిలకించటానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ అన్నిఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వం తరుపున లాల్ దర్వాజచేశారు.
లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారి బోనాల ఉత్సవాల రెండవ రోజైన 21వ తేదీ సోమవారం రంగం జరగనున్నది. అమ్మ వారి భక్తురాలు భవిష్యవాణి వినిపించనున్నారు. అనంతరం అమ్మ వారిఘటం ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







