జ్యురిక్ విమానాశ్రయంలో ‘ఎమిరేట్స్’ ప్రయాణికులకు కాళరాత్రి..!!
- July 21, 2025
యూఏఈ: జులై 19న రాత్రి సమయంలో దుబాయ్‌కు వెళ్లే ఎమిరేట్స్ విమానం EK086లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం కావడంతో జ్యూరిచ్ విమానాశ్రయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 300 మంది ప్రయాణికులలో కొందరికి హోటల్ వసతి కల్పించగా, సింగిల్-ఎంట్రీ స్కెంజెన్ వీసాలు ఉన్నవారు, విమానాశ్రయ టెర్మినల్ నుండి బయటకు వెళ్లలేకపోయారు. చాలా విమానాశ్రయ సౌకర్యాలు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు మూసివేయడంతో దాదాపు 20 మంది ప్రయాణికులు ఆహారం, సరైన విశ్రాంతి సౌకర్యాలు, సరైన సమాచారం కోసం గంటలపాటు వేచిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
దుబాయ్‌కు చెందిన ఇరానియన్ ప్రవాసిని నెగిన్ జాఫారి తన స్నేహితురాలు సనాజ్తో యూరోపియన్ వేసవి హాలిడేస్ కోసం బుక్ చేసుకున్నారు. జ్యురిక్ విమానాశ్రయంలో 20 గంటలకు పైగా గడిపిన తర్వాత వారు నిరాశతో వెనుదిరారు . “రాత్రి 11 గంటల ప్రాంతంలో, విమానాశ్రయ లైట్లు ఆగిపోవడం ప్రారంభించాయి. అందరూ గందరగోళానికి గురయ్యారు. అప్పుడే విమానం సర్వీసులు రద్దు చేసినట్ల తెలిపారు. రాత్రంగా కాళరాత్రి అయిందని పలువురు ప్యాసింజర్లు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







