సూరత్ విమానాశ్రయంలో 28 కేజీల బంగారం పట్టివేత

- July 22, 2025 , by Maagulf
సూరత్ విమానాశ్రయంలో 28 కేజీల బంగారం పట్టివేత

సూరత్: దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి సురత్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ బృందం అప్రమత్తంగా వ్యవహరించి దాదాపు 28 కిలోల బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకుంది.

జూలై 20న రాత్రి 10 గంటల సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX-174 విమానంలో ప్రయాణించిన మహిళ, పురుషులు సూరత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రొటీన్ తనిఖీల్లో వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారి లగేజీ, వ్యక్తిగత వస్తువులను క్షుణ్ణంగా శోధించగా చేయగా, వారి శరీరానికి చాకచక్యంగా దాచిన రూపంలో దాదాపు 28 కిలోల బంగారు పేస్ట్‌ను గుర్తించారు.

సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది చురుకైన చర్యతో ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగారు.ఈ ఘటనను కస్టమ్స్  అధికారులు కూడా తీవ్రంగా పరిగణించి బంగారం ఆవిర్భావం, రూట్ మరియు చివరి గమ్యస్థానాన్ని గుర్తించేందుకు సమగ్ర విచారణ ప్రారంభించారు.

ఇంత పెద్ద స్థాయిలో ప్రాంతీయ విమానాశ్రయాల ద్వారా బంగారు స్మగ్లింగ్ జరుగుతుండటం పై ఇప్పుడు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిబద్ధత, అప్రమత్తతకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.స్మగ్లర్లు ఉపయోగించే నూతన పద్ధతులు ఇప్పటికీ ఎటువంటి హద్దులూ లేవనే విషయం ఈ కేసుతో మరోసారి బయటపడింది.ఈ స్మగ్లింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com