జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- October 11, 2025
కువైట్: జహ్రా గవర్నరేట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్, గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
అల్-నయీమ్ ప్రాంతంలో ఓ కారు ప్రమాదానికి గురైందని అత్యవసర హాట్‌లైన్ నెంబర్ 112కు అందిన సమాచారంతో భద్రతా టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుందని వెల్లడించింది. ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి మత్తులో ఉన్నాడని, అతడి కారు నుంచి లిరికా పిల్స్, హాషిష్, డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు, 9mm తుపాకీ, బుల్లెట్లను జహ్రా గవర్నరేట్ రెస్క్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది.
అరెస్టయిన వ్యక్తి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగి అని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. నయీమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని, తదుపరి దర్యాప్తు కోసం జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌కు పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







