BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- October 11, 2025
మనామా: BHD 85.4 మిలియన్ల డీల్ కు బహ్రెయిన్, కువైట్ అంగీకరించాయి. ఈ నిధులతో షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా హైవే రెండో దశను అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చడానికి బహ్రెయిన్ ప్రభుత్వం మరియు కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మధ్య BHD 85.4 మిలియన్ల ఆర్థిక ప్రణాళికకు అంగీకారం కుదిరింది. వచ్చే వారం బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒప్పంద ఫ్రేమ్వర్క్ పై చర్చించనున్నారు.
2031 చివరి వరకు కొనసాగే ఈ రెండో దశ డెవవప్ మెంట్ పనులలో భాగంగా 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. అదే విధంగా హైవేను రెండు దిశలలో మూడు నుండి నాలుగు లేన్లకు విస్తరిస్తారు. ఇప్పటికే ఉన్న జంక్షన్ల పైన ఐదు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తారు.
అలాగే, సల్మాన్ అల్-ఫతే రోడ్డును రెండు కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. నాలుగు అట్-గ్రేడ్ జంక్షన్లను నిర్మిస్తారు. హైవేకి ఇరువైపులా మొత్తం ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆరు సర్వీస్-రోడ్ లింక్ల సమీపంలో అందమైన గార్డెన్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణ మరియు మనామా మధ్య ప్రయాణ మరియు సరుకు రవాణాను సులభతరం చేస్తుందని, ప్రయాణ సమయాలను తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి